తీపి పదార్థాలలో బాదుషా స్వీట్ ప్రత్యేకం. వీటిని చూడగానే నోరు ఊరుతుంది. సహజంగా స్వీట్లు మితంగా తీసుకుంటే మేలు చేస్తాయి. మోతాదు మించితే అనారోగ్యాన్ని తెస్తాయి. బాదుషా తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Freepik and social media
బాదుషా పాలతో చేస్తారు కనుక ఇందులో ప్రోటీన్ వుంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచి కండర శక్తికి దోహదపడుతుంది.
బాదుషాలో క్యాల్షియం వుంటుంది కనుక ఎముక పుష్టికి మేలు చేస్తుంది.
బాదుషాలో బాదములు కూడా వుంటాయి, ఇవి అధిక బరువును తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
అంతేకాదు, వీటిలోని విటమిన్ ఇ గుండె సంబంధిత సమస్యలు, కేన్సర్ వంటి వ్యాధులను నిరోధిస్తాయి.
పిస్తా పప్పులు కూడా వాడుతారు కనుక ఇవి కంటి దృష్టికి మేలు చేస్తాయి.
బాదుషాలో యాలుకల పొడి కలుపుతారు కనుక అది నోటి దుర్వాసనను అడ్డుకుంటుంది.
ఇందులో నేయి కలుపుతారు కనుక అది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.