సహజసిద్ధంగా పెదవులను అందంగా తీర్చిదిద్దుకోవడం ఎలా?

పెదవులు. మగువలు తమ అందాలకు మెరుగులు దిద్దుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇందులో అగ్రస్థానంలో వుండేవి అధరాలు. పెదవులు సహజంగా గులాబీ రంగులో కనిపించాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము.

webdunia

చక్కెరలో బాదం నూనెను కలిపి పెదాలను స్క్రబ్ చేయండి. ఇది మీ పెదాలను ఎప్పటికీ గులాబీ రంగులో ఉంచుతుంది.

బీట్‌రూట్‌ను పేస్ట్‌లా చేసి పెదవులపై రాసి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే పెదాలు గులాబీ రంగులోకి మారుతాయి.

కలబంద- తేనె మిక్స్ చేసి పేస్ట్ తయారుచేసి పెదవులపై అప్లై చేయండి. ఇది పెదాలకు తేమను ఇస్తుంది, పెదాలు మృదువుగా, గులాబీ రంగులో ఉంటాయి.

పుష్కలంగా నీరు త్రాగండి, ఇది మీ పెదాలను పొడిబారనీయదు. గులాబీ రంగులో కనిపిస్తుంది.

గులాబీ రేకులు, క్రీమ్ మిక్స్ చేసి పేస్ట్ తయారుచేసి పెదాలపై అప్లై చేయండి.

గ్లిజరిన్‌లో రోజ్ వాటర్ మిక్స్ చేసి పెదాలపై రాస్తే అవి గులాబీ రంగులో ఉంటాయి.

పెదాలపై నిమ్మకాయను రుద్దండి, ఆపై దానిని కడిగి, ఆపై కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి.

కొబ్బరి నూనెతో మీ పెదాలను మసాజ్ చేయండి, ఇది మీ పెదాలను పింక్‌గా మార్చుతుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.