వేడివేడిగా రుచికరమైన గోబీ 65 ఎలా తయారుచేయాలి?

నిమిషాల్లో తయారుచేసే ఉత్తమ స్నాక్స్‌లో క్యాలీఫ్లవర్- గోబీ 65 ఒకటి. నిమిషాల్లో వేడివేడిగా రుచికరమైన క్యాలీఫ్లవర్ గోబీ 65 ఎలా తయారుచేయాలో తెలుసుకుందాము.

credit: Instagram and pixabay

క్యాలీఫ్లవర్‌ను పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.

మరిగే నీటిలో కాస్త ఉప్పు, పసుపు వేసి అందులో క్యాలీఫ్లవర్ ముక్కలను వేయాలి.

దీంతో క్యాలీఫ్లవర్‌లోని పురుగులు చనిపోతాయి, తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలను తీసుకుని చల్లారనివ్వాలి.

పెరుగు, నిమ్మరసం, పసుపు, గరం మసాలా, బియ్యం పిండి, మొక్కజొన్న పిండి, అల్లం, వెల్లుల్లి అన్నింటినీ తగినంత నీటిలో వేసి బాగా కలపాలి

ఈ మిశ్రమంలో క్యాలీఫ్లవర్‌ ముక్కలను అరగంట నానబెట్టాలి.

తర్వాత బాణలిలో నూనె వేడి చేసి క్యాలీఫ్లవర్ ముక్కలను వేయించాలి.

గ్రిల్డ్ క్యాలీఫ్లవర్- గోబీ 65కి తరిగిన ఉల్లిపాయ, నిమ్మకాయతో సర్వ్ చేస్తే రుచికరంగా ఉంటుంది.