బాదం టీ తాగాలని వుందా? ఐతే చేసేద్దాం రండి

ఉదయం వేళ చాలామంది కాఫీ, టీ వంటివి సేవిస్తుంటారు. ఐతే కొందరు టీని రకరకాలుగా చేసుకుని తాగుతుంటారు. వీటిలో బాదం టీ ఒకటి. ఈ టీ తాగితే రోజంతా ఎనర్జీతో వుంటారని చెపుతారు. దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాము.

credit: social media and webdunia

బాదం టీ తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు ఇవే

టీ పొడి, బాదం పప్పులు, పాలు, నిమ్మరసం, చక్కెర

బాదం టీని తయారు చేసేందుకు కావలసిన మోతాదులో మంచినీటిని పాత్రలో పోయాలి.

ఆ నీటిని స్టౌపై పెట్టి నీటిలో సన్నగా తరిగిన బాదం పప్పులు వేసి మరిగించాలి.

ఆపై టీ పొడి, పాలు పోసి 10 నిమిషాల పాటు మరిగించాలి.

తరువాత అందులో చక్కెర, తేనె లేదా నిమ్మరసం కలుపుకోవాలి.

ఈ టీ తీసుకోవడం వలన తలనొప్పి తగ్గడమే కాకుండా రోజంతా ఎనర్జీగా ఉంటారు.