క్యారెట్ దోసె ఎలా చేయాలో తెలుసుకుందాం

మనం రోజూ తీసుకునే ఆహారంలో పోషక విలువలున్న కూరగాయలను చేర్చుకోవడం వల్ల పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందించవచ్చు. పోషక విలువలున్న క్యారెట్‌లతో క్యారెట్ దోసె ఎలా చేయాలో తెలుసుకుందాము.

credit: social media and webdunia

కావలసిన పదార్థాలు: ఒక కప్పు ముడి బియ్యం, పావు కప్పు ఉడకబెట్టిన అన్నం, ముప్పావు కప్పు తురిమిన క్యారెట్, 5 ఎర్ర మిరపకాయలు

అర టీ స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయ, ఒకటిన్నర స్పూన్ల ఉప్పు పొడి, నిమ్మపండు సైజంత చింతపండు

బియ్యాన్ని 3 గంటలు నానబెట్టి రుబ్బుకోవాలి.

రుబ్బుకున్న పిండిని, ఉడకబెట్టిన అన్నాన్ని మెత్తగా గ్రైండ్ చేసి కలుపుకోవాలి.

దీనికి అవసరమైన ఉప్పు వేసి, పులియబెట్టడానికి కాసేపు ఉంచండి.

క్యారెట్‌ను పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

క్యారెట్ పేస్టును పిండితో కలపాలి, దీనితో పిండి బంగారు ఎరుపు రంగులోకి మారుతుంది.

కొబ్బరి చట్నీ, శనగపప్పు చట్నీలను వేసుకుని క్యారెట్ దోసెను తింటే చాలా రుచిగా ఉంటాయి.