గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

గుండెను గుల్లచేసే వాటిలో చెడు కొలెస్ట్రాల్ ఒకటి. అలాగే అధిక రక్తపోటు, సరైన వ్యాయామం, క్రమబద్దమైన ఆహారం తీసుకోకకపోవడం కూడా గుండె సమస్యలకు కారణమవుతాయి. గుండె అనారోగ్యానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ పెరిగితే దానిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము.

credit: social media and webdunia

చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే ఫాస్ట్ ఫుడ్స్, ఇతర మాంసాహారాన్ని తినడం మానేయాలి.

రోజూ ఆపిల్, సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తొలగిపోతుంది.

పెరుగు తీసుకోవాలి, ఐతే పెరుగును తక్కువ మోతాదులో తినాలి.

మొలకలు రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి కాబట్టి వాటిని తినడం ప్రారంభించాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం లేదా యోగా చేయాలి, సైక్లింగ్ లేదా నడక కూడా చేయవచ్చు.

కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి కూడా ఉపయోగపడుతుంది.

ఏదైనా పండు, కూరగాయలు మొదలైన వాటిలో రాక్ సాల్ట్ మిక్స్ చేసి తినాలి.

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మెంతి నీరు కూడా తీసుకోవచ్చు.

ఉదయం ఉసిరికాయ లేదా కలబంద రసం త్రాగవచ్చు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.