తేనె ఎలా వాడాలి? వివరాలు ఇవిగో

తేనె ఎంతో ఆరోగ్యం అని తీసుకుంటుంటారు. కానీ ఆ తేనెను వాడకూడని సందర్భాలు వున్నాయన్నది మీకు తెలుసా? ఎప్పుడు వాడకూడదో తెలుసుకుందాము.

webdunia

తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు.

పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి తేనెను నేరుగా వాడకూడదు.

తేనెను మరిగించకూడదు. తేనె ఉష్ణ వీర్య పదార్థం, తేనెను నేరుగా మంటపైన వేడిచేయకూడదు.

తేనెను వేడి వాతావరణంలోనూ, ఎండాకాలంలో పరిమితంగానే వాడాలి.

మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతోనూ తేనెను కలపకూడదు.

తేనెను వర్షం నీళ్లతో కలిపి వాడకూడదు. తేనెను ఫ్రిజ్‌లో ఉంచకూడదు.

ఫ్రిజ్‌లో ఉంచితే పంచదార స్పటికాలు తయారవుతాయి. ఆ సందర్భాల్లో ఎండలో ఉంచితే సరిపోతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. వైద్యుల పర్యవేక్షణలో తేనెను వాడాలి.

తేనెను, నెయ్యిని సమాన భాగాలుగా తీసుకోకూడదు. ఇది విరుద్ధం.