ఇలాంటివి తరచూ కనబడితే గుండె పోటు లక్షణాలు కావచ్చు

గుండె పోటు. ఈమధ్య విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నటుడు పునీత్ రాజ్ కుమార్, సింగర్ కెకె, బ్రహ్మ స్వరూప్ మిశ్రా, సోనాలి ఫోగట్ వంటివారు గుండె పోటు కారణంగా కన్నుమూశారు. గుండెపోటు లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము.

credit: twitter

జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం, దగ్గు త‌ర‌చుగా వ‌స్తున్నా, అవి ఓ ప‌ట్టాన త‌గ్గ‌కున్నా హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌న‌డానికి సూచిక‌లుగా నిలుస్తాయి.

హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన ల‌క్ష‌ణాల్లో గాలి పీల్చుకోవ‌డంలో ఇబ్బందులు, ఇలా వుంటే దాన్ని హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణంగా అనుమానించాలి.

ఛాతిలో అసౌక‌ర్యంగా ఉంటున్నా, ఏదో బ‌రువుగా ఛాతిపై పెట్టిన‌ట్టు అనిపిస్తున్నా అది హార్ట్ ఎటాక్‌కు సూచ‌నే అవుతుంది.

మ‌త్తుగా నిద్ర వ‌చ్చిన‌ట్టు ఉంటున్నా, చెమ‌ట‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నా అవి కూడా హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణాలు అయ్యేందుకు అవ‌కాశం.

విప‌రీతంగా అల‌సిపోవ‌డం, ఒళ్లంతా నొప్పులుగా ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు త‌ర‌చూ క‌నిపిస్తుంటే వాటిని అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌దు.

నిత్యం వికారంగా ఉన్నా, తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ‌క‌పోతున్నా, గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌ర‌చూ వ‌స్తున్నా అనుమానించాల్సిందే.

కాళ్లు, పాదాలు, మ‌డిమ‌లు అన్నీ ఉబ్బిపోయి క‌నిపిస్తే వాటిని హార్ట్ ఎటాక్‌కు సూచ‌న‌లుగా భావించాలి.

శ‌రీరం పై భాగం నుంచి ఎడ‌మ చేతి కిందిగా నొప్పి వ‌స్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణంగా అనుమానించాలి.

ఒక్కోసారి ద‌వ‌డ‌ల్లో, గొంతులో కూడా నొప్పి అనిపించ‌వ‌చ్చు.

గుండె సంబంధ స‌మ‌స్య‌లు ఉంటే గుండె కొట్టుకోవ‌డం కూడా ఎప్పటిలాగా ఉండదు.

గమనిక: ఇవి మాత్రమే కాదు ఇంకా ఇతర సమస్యలు కూడా అగుపించవచ్చు. నిపుణుడిని అడిగి తెలుసుకోవాలి.