ఇవి తింటే శరీరానికి ప్రోటీన్లు కావలసినంత లభ్యం

ఆరోగ్యానికి ప్రతిరోజూ తగినంత ప్రోటీన్ తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఎలాంటి ఆహారం ద్వారా సమకూరుతుందో తెలుసుకుని వాటిని తీసుకుంటూ వుండాలి. ఐతే ప్రోటీన్ ఏయే పదార్థాల్లో పుష్కలంగా లభిస్తుందో తెలుసుకుందాము.

credit: social media and webdunia

కోడిగుడ్లు ప్రోటీన్‌కి మంచి మూలం, వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు వుంటాయి.

బాదం పప్పుల్లో ఫైబర్, విటమిన్ ఇ, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలుంటాయి కనుక దీని నుంచి ప్రోటీన్‌ అందుతుంది.

డైరీ మిల్క్‌లో శరీరానికి అవసరమైన పోషకాలు వుంటాయి, ఇది అధిక నాణ్యత గల ప్రోటీన్ యొక్క మంచి మూలం.

చేపలు ప్రోటీన్‌కి అద్భుతమైన మూలం, అయోడిన్, సెలీనియం, విటమిన్ B12 వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు లభిస్తాయి.

గుమ్మడికాయ గింజలు ఇనుము, భాస్వరం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాల గొప్ప మూలం. ఇవి మొక్కల ఆధారిత ప్రోటీన్.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.