కుంకుమపువ్వు తింటే ప్రయోజనాలు ఏమిటి?

కుంకుమపువ్వుతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కుంకుమపువ్వులో ధయామిన్, రైబోఫ్లెవిన్ ఉంటుంది. ఇది గర్భవతులకు ఎంతో మేలు చేస్తుంది. కుంకుమపువ్వుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

webdunia

కడుపు ఉబ్బరం, అజీర్తి, కడుపు పట్టేయటం వంటి సమస్యల్ని దూరం చేసే గుణాలు కుంకుమపువ్వులో సమృద్దిగా ఉన్నాయి.

గుండె ఆరోగ్యాన్ని చక్కబరచడంతో పాటు రక్తంలోని కొలెస్ట్రాల్ నిలువల్ని కుంకుమపువ్వు తగ్గిస్తుంది.

కుంకుమపువ్వులో జ్ఞాపకశక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

శరీరంలో వేడి ఎక్కువుగా ఉన్నవారు కుంకుమపువ్వు తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.

కుంకుమపువ్వును సుగంధ ద్రవ్యాల్లో కూడా ఉపయోగిస్తారు.

కుంకుమపువ్వుని వివిధ రకాల క్యాన్సర్‌కు చికిత్సగా వాడుతుంటారు.

కుంకుమపువ్వు ఊపిరితిత్తులను శుభ్రపరచి ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది.

కుంకుమపువ్వుని వేడి పాలలో వేసుకొని తాగటం వల్ల మానసిక వత్తిడి తగ్గుతుంది.