శనగలు రోజూ తింటే ఆరోగ్యానికి మంచిదా కాదా?

మనం నిత్య జీవితంలో తీసుకునే శనగలులో చాలా విటమిన్లు, పోషకాలు ఉంటాయి. నల్ల శనగలు, తెల్ల శనగలు రెండింటిలో ప్రొటీన్లు మరియు పోషకాలు అధికంగా ఉంటాయి. వాటి వివరాలు తెలుసుకుందాము.

credit: social media

శనగ ఆకుల నుంచి పులుసు తయారుచేసి పైత్యానికి మందుగా వాడుతారు.

శనగలలో ఐరన్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నాయి.

శనగలలో చలువ చేసే గుణాలు ఉన్నాయి, ఇవి రక్త దోషాలను పోగొట్టి బలాన్నిస్తాయి.

శనగాకును ఆహారంగా వాడటం వల్ల పిత్తరోగములు నశిస్తాయి.

గజ్జి, చిడుము, తామర గల వారు ప్రతిరోజూ శెనగపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తుంటే ఆ వ్యాధులు తగ్గుతాయి.

షాంపుకు బదులు ప్రతిసారి శనగపిండితో తలను రుద్ది స్నానం చేస్తే వెంట్రుకలు పెరుగుతాయి.

రోజూ శనగలు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు, మూత్ర వ్యాధులు ఉన్నవారు కూడా వీటిని తగ్గిస్తే మంచిది.