నిలబడి భోజనం చేస్తే ఏమవుతుంది?

చాలామంది ఇటీవలి కాలంలో బఫె ఫుడ్ అంటూ నిలబడి భోజనం చేసేయడం కనబడుతుంది. ఏదో ఒకసారి అయితే ఫర్వాలేదు కానీ ప్రతిరోజూ ఇలా నిలబడి భోజనం చేస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము.

credit: social media

నిలబడి ఆహారం తీసుకునేవారు మోతాదుకి మించి ఎక్కువ తినేస్తారు, దీనితో జీర్ణం కాక అవస్థలు పడుతారు.

అంతేకాదు, నిలబడి తినడాన్ని అలవాటుగా మార్చుకున్నవారు ఊబకాయానికి గురయ్యే అవకాశం వుందంటున్నారు.

నుంచుని ఆహారం తీసుకోవడం వల్ల అది నేరుగా గొంతు నుంచి పొట్టలో పడిపోయి అన్నవాహికపై దుష్ప్రభావం చూపుతుంది.

నిలబడి తినేవారిలో అల్సర్ వంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు.

నిలబడి ఆహారం తీసుకునేవారిలో పేగులు కుంచించుకుపోవడం వంటి సమస్య రావచ్చు.

ఆహారాన్ని ప్రశాంతంగా కూర్చుని భోజనం చేస్తే మంచి ఫలితాలు వుంటాయంటారు నిపుణులు.

నిలబడి భోజనం చేయడం వల్ల చికాకుగా వుంటుంది, దాంతో ఆహారాన్ని ఆస్వాదించే అవకాశం వుండదు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.