మగవారు పనస పండు తొనలు తింటే ఏంటి?

వేసవి సీజన్‌లో మామిడి పండ్లు, ముంజకాయలు, పనస పండ్లు దర్శనమిస్తాయి. చలువచేసే పుచ్చకాయ, తర్బూజాలు వుంటాయి. పనస పండు ఆరోగ్యపరంగా చేసే మేలు అంతాఇంతా కాదు. పనస వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram

పనస పండు తినడం వలన శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది. ఇది శరీరంలోని గ్లూకోజ్ లెవల్ పెరిగేలా చేస్తుంది.

పనస పండులో వుండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్యను తగ్గిస్తుంది.

పనస చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.

రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండు తింటే మంచి ఫలితాన్నిస్తుంది.

పనసపండులో ఉన్న క్యాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది.

పనసలో ఉండే ఫైబర్ జీవక్రియలను సాఫీగా జరిగేలా చేసి కడుపులో ఏర్పడే గ్యాస్, అల్సర్ వంటి జీర్ణ వ్యాధులను నివారిస్తుంది.

పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి.

పనస తొనలు తినడం ద్వారా మగవారిలో సంతానోత్పత్తి శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.