జనపనార గింజలు చాలా పోషకమైనవి. జనపనార విత్తనాలలో రెండు ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, ఒమేగా 3 యాసిడ్స్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌లతో సమృద్ధిగా ఉంటాయి. వీటితో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: twitter
జనపనార గింజల్లో నైట్రిక్ ఆక్సైడ్ వుంటుంది. ఇది రక్త నాళాలు విస్తరిస్తుండటం వల్ల రక్తపోటు తగ్గడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని నిరోధిస్తుంది.
జనపనార గింజలు, జనపనార నూనె చర్మ రుగ్మతల నుండి కాపాడుతాయి.
జనపనార విత్తనాలు మొక్కల ఆధారిత ప్రోటీన్ యొక్క గొప్ప మూలం.
జనపనార విత్తనాలు మహిళల్లో మెనోపాజ్ దశను త్వరగా రాకుండా చేస్తాయి.
జనపనార విత్తనాలు జీర్ణక్రియకు సహాయపడతాయి.
ఇవి బరువు తగ్గటానికి కూడా దోహదపడతాయి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.