కోవిడ్ వేరియంట్ ఎరిస్ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసా?
ప్రస్తుతం కోవిడ్ వేరియంట్ ఎరిస్ పలు దేశాల్లో విజృంభిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ వేరియంట్ ఎరిస్ లక్షణాలు ఎలా వుంటాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో కనబడుతున్న ఎరిస్ లక్షణాలు ఇలా వున్నాయి.
credit: social media
విపరీతంగా గొంతునొప్పి సమస్య కనబడవచ్చు.
జలుబు చేసి విపరీతంగా ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ.
ఆగకుండా వచ్చే తుమ్ములు.
కఫం లేకుండా లేదంటే కఫంతో కూడి సతమతం చేసే దగ్గు.
విపరీతంగా తలనొప్పి రావచ్చు.
గొంతు బొంగురుపోవడం తలెత్తవచ్చు.
కండరాల నొప్పులతో పాటు వాసన చూసే శక్తి కోల్పోవచ్చు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.