బిల్వ పత్రం. ఇది పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరం అని విశ్వాసం. ఈ బిల్వ పత్రంలో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకును మారేడు ఆకు అంటారు. దీనితో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
బిల్వ పత్రం అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది.
మారేడులో విటమిన్లు ఎ, బి1, బి2, సి, ఖనిజాలు, కాల్షియం, పొటాషియం, ఇనుముతో కూడిన అనేక పోషకాలున్నాయి.
బిల్వ పత్రంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల ఇది శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది.
బిల్వ పత్రంలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి మేలు చేస్తుంది.
మారేడు ఆకులలో ధమనులు గట్టిపడకుండా నిరోధించే గుణం వుంది. గుండె జబ్బులను నివారిస్తుంది.