ప్రపంచంలో అత్యంత ఖరీదైన మామిడి పండ్లు, వివరాలు

మామిడి కాయలను చూస్తే నోరూరుతుంది. వేసవిలో తీయటి సువాసనలతో మార్కెట్లో ప్రత్యక్షమవుతాయి ఈ మామిడి పండ్లు. ఐతే మామిడి పండ్లు కిలో 200 నుంచి 300 రూపాయల వరకూ వుండటాన్ని మనం చూసాము. ఐతే లక్షల్లో కూడా వున్నాయని తెలుసా, తెలుసుకుందాము రండి.

credit: social media

రుచితో పాటు కొన్ని ప్రత్యేకమైన గుణాలు వున్నటువంటి మామిడి పండ్లు చాలా తక్కువగా లభిస్తాయి.

జపాన్‌లో మియాజాకి మామిడి ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైనది, దీని ధర కిలో ఒక్కింటికి రెండున్నర లక్షల నుంచి 3 లక్షల రూపాయలు.

కోహితూర్ మామిడి కాశ్మీర్‌లో లభిస్తుంది, ఒక మామిడి కాయ ధర రూ. 1500 నుండి రూ. 3000

అల్ఫోన్సో మామిడి పండ్లు కొంకణ్ ప్రాంతంలో దొరుకుతాయి, ఒక మామిడి పెట్టె ధర రూ. 2500 నుండి రూ. 7000

కారబావో మామిడి ఫిలిప్పీన్స్‌లో లభిస్తాయి, ఒక మామిడి కాయ ధర రూ. 1500 నుండి రూ. 2000

సింధ్రి మామిడి పాకిస్థాన్‌లో లభిస్తుంది, దీని ధర రూ. 400 నుంచి రూ. 1800 వరకూ వుంటుంది.

సీజన్‌ను బట్టి ఈ మామిడి పండ్ల ధరలు మారుతూ ఉంటాయి.