లవంగాలు ఉపయోగాలు

లవంగాలు. ఇవి వంటకాలకు రుచిని కల్పిస్తాయి. అంతేకాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాము.

credit: Instagram

దగ్గుకు సహజమైన మందు లవంగం, శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.

లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది.

ఆహారం సరిగా జీర్ణం కాకపోయినా, వాంతులు వచ్చినా, కడుపులో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనెను తీసుకుంటే ఉపశమనం ఉంటుంది.

తేనె, కొన్ని చుక్కల లవంగాల నూనెను గోరువెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడుసార్లు తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

తులసి, పుదీనా, లవంగాలు, యాలకుల మిశ్రమంతో టీలా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది.

ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది.

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.