పొన్నగంటికూర పురుషులు తింటే అద్భుతమైన శక్తి

ఆకుకూరలు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. అందులో పొన్నగంటికూరది ప్రత్యేక స్థానం. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాము.

webdunia

పొన్నగంటి కూర కంటి చూపును మెరుగుపరుస్తుంది.

ఈ కూర పురుషులకు కావలసిన శక్తిని సమకూరుస్తుంది.

పొన్నగంటి కూర జీవక్రియల్లోని లోపాలను సరిచేస్తుంది.

టేబుల్‌ స్పూను తాజా ఆకుల రసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా తగ్గుతాయి.

నరాల్లో నొప్పికి, వెన్నునొప్పికి పొన్నగంటి కూర దివ్యౌషధంగా పనిచేస్తుంది.

మధుమేహంతో బాధపడేవారికి పొన్నగంటి కూర మేలు చేస్తుంది.

మొలల వ్యాధిని కూడా ఇది నివారిస్తుందని నిపుణులు చెపుతారు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.