బంగాళాదుంప. పొటాటో చిప్స్, పొటాటో కుర్మా... ఇలా అనేక రకాలైన వెరైటీలను బంగాళాదుంపలతో చేస్తుంటారు. పుష్కలంగా పిండి పదార్థాలను కలిగి ఉన్న ఈ దుంపలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
credit: Instagram and webdunia
బంగాళాదుంపలో ఉండే బి6 విటమిన్ శరీరంలోని ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తాయి.
వీటిలో ఉన్న పీచు పదార్థం గుండెజబ్బుల నుండి రక్షణనిస్తుంది.
బంగాళాదుంపలను సన్నగా కోసి ఆ ముక్కలను అలసిన కళ్లపై పెట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది.
బాలింతలకు బాగా పాలుపడాలంటే బంగాళాదుంపలను తీసుకుంటుండాలి.
బంగాళాదుంపలను స్థూలకాయులు మాత్రం తీసుకోకూడదు.
షుగర్ వ్యాధితో బాధపడేవారు, కీళ్ల నొప్పులున్నవారికి ఇది మంచిది కాదు.
గమనిక: చిట్కాలు పాటించేముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.