మోతాదుకి మించి తేనె సేవిస్తే కలిగే దుష్ర్పభావాలు

తేనె. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐతే మోతాదుకి మించి తేనెను సేవిస్తే మాత్రం అది అనారోగ్యానికి కారణమవుతుంది. మితిమీరి తేనెను సేవిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము.

credit: social media and webdunia

చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం తేనె. ఐతే దీనిని ఎక్కువగా సేవిస్తే ఆరోగ్యానికి సమస్యలు తెస్తుంది

తేనెను ఎక్కువగా తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.

తేనె అధికంగా తీసుకుంటే అది తక్కువ రక్తపోటు లేదా హైపోటెన్షన్ ప్రమాదానికి గురి చేస్తుంది.

శరీరం తేనెలోని చక్కెరలను జీర్ణం చేయలేకపోవడం వల్ల తేనె ఉబ్బరం లేదా విరేచనాలకు దారితీస్తుంది.

తేనెలో ఉండే అధిక కేలరీలు, చక్కెర, కార్బోహైడ్రేట్లు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి.

దాదాపు 82% తేనె చక్కెరతో తయారు చేయబడింది, కనుక ఇది దంతాలను దెబ్బతీసే అవకాశం వుంటుంది.

తేనెను రోజుకు 50 మి.లీ లేదా 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది, అంతకంటే ఎక్కువ సేవించకూడదు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.