ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు. సహజంగా చాలామంది బిస్కెట్లు తినేందుకు కొంటారు కానీ ప్యాకెట్ పైన ఎక్స్‌పైరీ డేట్ చూడరు. అలా చూడకుండా పొరబాటున ఎక్స్‌పైరీ అయిపోయిన బిస్కెట్లు తింటే అవి పలు అనారోగ్యాలకు కారణమవుతాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన బిస్కెట్లు తింటే డయారియా, వాంతులు, జీర్ణాశయ సమస్యలు తలెత్తుతాయి.

కొందరిలో అలెర్జీ సమస్యలు, శరీరంలో వాపు, దురద వంటి సమస్యలు రావచ్చు.

ఎక్స్‌పైరీ బిస్కెట్లు తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఇ-కోలి వంటివి చేరి జీర్ణాశయాన్ని దెబ్బతీయవచ్చు.

ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన బిస్కెట్లలో పోషకాలు ఏమీ లేకపోగా కొత్త చిక్కులను తెస్తాయి.

ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన బిస్కెట్లు స్టోర్ చేసిన ప్రదేశాన్ని బట్టి కూడా అవి తిన్నప్పుడు సమస్య తీవ్రత వుంటుంది.

ఎక్స్‌పైరీ డేట్ అయిన బిస్కెట్లు తినకుండా జాగ్రత్త పడాలి లేదంటే అవి పలు అనారోగ్య సమస్యలు తెస్తాయి.