ప్రతి గృహిణి రుచికరమైన వంటలను తయారు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి వారు తాము చేసే పనులు మరింత సులభంగా, ఈజీగా చేసుకునేందుకు వంటింటి చిట్కాలు అనేకం ఉన్నాయి. వీటిని పాటిస్తే వారి పని మరింత సులభమైపోతుంది.
Social Media
ఫ్రిజ్‌లో పుదీనా ఆకులు ఉంచితే ఫ్రిజ్ దుర్వాసన పోతుంది. పుదీనా పచ్చడి చేసేప్పుడు పెరుగు కలిపితే రుచిగా ఉంటుంది.
బియ్యం కడిగిన నీటిలో కోడిగుడ్లను ఉడకబెడితే పెంకులు సులుపుగా వస్తాయి.
కూరల్లో పులుపు తక్కువగా ఉంటే మామిడి పొడితో కొంచెం పెరుగు కలిపి కూరలో వేస్తే టమోటా రుచి వస్తుంది.