బృహతీ పత్రం (వాకుడు ఆకు) ఉపయోగాలు ఏమిటో తెలుసా?

బృహతీ పత్రం. దీని పేరు వినే వుంటారు. దీనిని వాకుడు ఆకు అని కూడా పిలుస్తారు. వినాయక చవితి పూజలో గణేశునికి సమర్పించే 21 పత్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆకు, చెట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: Instagram

బృహతీ పత్రం లేదా వాకుడు ఆకు అత్యుత్తమ వ్యాధి నిరోధిని. దగ్గు, ఉబ్బసం తగ్గించగలదు.

మూత్రం సాఫీగా రావడానికి, గుండె ఆరోగ్యానికి ఈ పత్రం మేలు చేస్తుంది.

బృహతీ పత్రాలను తీసుకుని కషాయంలా చేసి పుక్కిలిపడితే నోటి దుర్వాసన పోతుంది.

కీళ్ల నొప్పులకు బృహతీపత్రాలను కాచి ఉప్పుతో కలిపి నూరి గుడ్డలో తీసుకుని సమస్య వున్నచోట కాపడం పెడితే తగ్గిపోతాయి.

దురదలు, నొప్పులు తగ్గేందుకు బృహతీ పత్రం చూర్ణం వాడుకోవచ్చు.

కఫ వాతాలను తగ్గించేందుకు, జీర్ణ శక్తిని పెంచేందుకు ఈ ఆకు ఎంతగానో తోడ్పడుతుంది.

రక్తాన్ని శుద్ధి చేయగల శక్తి వాకుడు ఆకులకు వుంది.

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.