ప్రతి రోజూ కూరల్లో ఉపయోగించే అయోడైజ్డ్ సాల్ట్ ఉప్పు కంటే.. రాతి ఉప్పు లేదా రాక్ సాల్ట్‌ను ఉపయోగించడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
instagram
రాక్ ఉప్పును హిమాలయన్ ఉప్పు, రాక్ ఉప్పు, సైంధవ ఉప్పు, హాలైడ్ సోడియం క్లోరైడ్ అని కూడా పిలుస్తారు.
ఇందులో మెగ్నీషియం, సల్ఫర్ వంటి రసాయాలు కలిసివుంటాయి. పైగా, 90 కంటే ఎక్కువ ఖనిజాలు ఉన్నాయి.
రాళ్ల ఉప్పును నీటిలో కలుపుకోవడం, తాగడం, ఆహారంలో లేదా స్నానం చేయడం ద్వారా రాళ్ల ఉప్పు ప్రయోజనాలను పొందవచ్చు.
దీని వినియోగం ద్వారా కండరాల తిమ్మిరి సమస్య తొలగిపోతుంది.
జీర్ణ సమస్యలకు ఇది సరైన ఔషధం.
గొంతు నొప్పి ఉంటే, రాతి ఉప్పు సరైన చికిత్స.
నోటిలో పేరుకుపోయిన హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. చిగుళ్లకు మేలు చేస్తుంది.
జీవక్రియను పెంచడానికి రాక్ ఉప్పును ఉపయోగించండి.
మీరు బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే, రాతి ఉప్పును తీసుకుంటుంటే మేలు జరుగుతుంది.
రాతి ఉప్పు అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గమనిక : రాక్ సాల్ట్ ఉపయోగిస్తూ ఆరోగ్య సమస్యలను అధిగమించే ముందు వైద్యుని సరైన సలహా తీసుకోండి.