రాత్రి పూట ఒక్క యాలుక్కాయను తింటే చాలు ఆ సమస్యలన్నీ ఔట్
యాలకులు. ఇవి సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనది. వీటిలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట యాలకును తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే అధిక బరువు, చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది.
యాలకులు తీసుకుంటుంటే రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది.
యాలకులు రక్తపోటును తగ్గిస్తాయి, శ్వాసను మెరుగుపరుస్తాయి.
యాలకులు తీసుకునేవారిలో నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా నిద్రలో వచ్చే గురక రాదు.
యాలకులు కిడ్నీలలో ఏర్పడ్డ మలినాలను తొలగించడంలో, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నియంత్రిస్తాయి.
చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో యాలకులు దోహదపడతాయి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే, మరిన్ని వివరాల కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.