స్వీట్ కార్న్ తింటున్నారా, ఇవి తెలుసా?

స్వీట్‌కార్న్‌ లేదా తీపి మొక్కజొన్న. తీపి మొక్కజొన్నలో విటమిన్ బి, సీలతో పాటు మెగ్నీషియమ్, పొటాషియం ఖనిజాలున్నాయి. స్వీట్ కార్న్ తినడం వల్ల కలిగే మేలు ఏమిటో తెలుసుకుందాము.

webdunia and Instagram

అధిక ఫైబర్ కంటెంట్ స్వీట్ కార్న్ ప్రయోజనాలలో ఒకటి. ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థతో సహా మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

స్వీట్ కార్న్ తింటుంటే రక్తపోటు తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్‌ను అదుపులో వుంచుంది. గుండె జబ్బులను నివారించడంలో పాత్ర పోషిస్తుంది.

మొక్కజొన్న తినడం ఆరోగ్యకరమైన మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది. ఇది జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది.

గర్భధారణ సమయంలో మహిళలకు ఫోలేట్ మేలు చేస్తుంది. ఇది స్వీట్ కార్న్‌లో వుంది.

పసుపురంగులో ఉన్న స్వీట్‌కార్న్‌లో ఎక్కువగా ఉన్న యాంటీఆక్సిడెంట్స్ కళ్లకు ఎంతో మేలు చేస్తాయి.

మొక్కజొన్న తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించవచ్చు. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

మొక్కజొన్న ఎక్కువగా తింటే, మలబద్ధకం, కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్, హేమోరాయిడ్లకు కారణం కావచ్చు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.