తీపి చిలకడ దుంపలు ఎవరు తినకూడదు, ఎందుకు తినకూడదు?

చిలకడ దుంపలు. వీటిలో పలు పోషకాలున్నాయి. ఐతే కొన్ని అనారోగ్య పరిస్థితులు కలిగి వున్నవారు చిలకడ దుంపలను తినకూడదు. ఎలాంటి వారు తినకూడదో తెలుసుకుందాము.

credit: social media and webdunia

కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నట్లయితే చిలగడదుంపను తినకూడదు.

స్వీట్ పొటాటోలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది సేంద్రీయ ఆమ్లం. దీని వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య పెరిగే అవకాశం ఉంది.

చిలకడ దుంపల్లో మన్నిటాల్ అనే పదార్ధం కూడా ఉంటుంది. దీని వల్ల కొందరికి అలర్జీ సమస్యలు రావచ్చు.

జీర్ణవ్యవస్థ బలహీనంగా వున్నవారు తినరాదు, ఎందుకంటే ఇది కడుపు నొప్పి లేదా ఉబ్బరం కలిగిస్తుంది.

మైగ్రేన్ ఉన్నవారు దానిని అస్సలు తీసుకోకూడదు.

చిలకడ దుంపల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది, కాబట్టి ఎక్కువగా తింటే తలనొప్పి వస్తుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.