HMPV హ్యూమన్ మెటాన్యూమోవైరస్ లక్షణాలు ఏమిటి?

HMPV అనేది శ్వాసకోశ వైరస్, ఇది ఇప్పటికే భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఇది వివిధ దేశాలలో శ్వాసకోశ వ్యాధులతో సంబంధం కలిగి ఉంది. అయినప్పటికీ భారతదేశంలో కేసులలో అసాధారణ పెరుగుదల లేదు. ఇది ఎగువ శ్వాసకోశ సంక్రమణకు కారణమయ్యే సాధారణ శ్వాసకోశ వైరస్. HMPV వైరస్ కలిగి ఉన్న వారితో ప్రత్యక్ష పరిచయం ద్వారా లేదా వైరస్‌తో కలుషితమైన వస్తువులను తాకడం ద్వారా వ్యాపిస్తుంది.

credit: social media and webdunia

విపరీతంగా దగ్గు వస్తుంటుంది.

జ్వరం కూడా తగులుతుంది.

ముక్కు కారడం లేదా ముక్కుదిబ్బడగా వుంటుంది.

గొంతు నొప్పిగా వుంటుంది.

గురక కూడా వస్తుంది.

శ్వాస ఆడకపోవడం సమస్య తలెత్తుతుంది.

శరీరంపై దద్దుర్లు వస్తాయి.