వంటల్లో రుచి కోసం వివిధ రకాల పొడులను చల్లుతుంటారు. ఇలాంటి వాటిలో మోనోసోడియం గ్లూటమేట్ ఒకటి. అంటే ఇదో రకమైన ఉప్పు. దీనిని టేస్టింగ్ సాల్ట్ అని పిలుస్తుంటారు. ఈ ఉప్పును వాడితే కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసుకుందాము.
credit: social media
టేస్టింగ్ సాల్ట్‌ను ప్రధానంగా హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీల తయారు చేసే ఆహార పదార్థాలలో విరివిగా వాడుతారు.
టేస్టింగ్ సాల్ట్‌తో చేసిన ఆహారాలను అధికంగా ఆరగించడం వల్ల ఊబకాయానికి గురవుతారు.
ఈ ఉప్పుతో తయారుచేసినవి తినడం వల్ల మైగ్రేన్, బద్దకం, హార్మోన్ల అసమతుల్యత, వికారం, నీరసం, ఛాతి నొప్పి తదితర సమస్యలు.
ఈ సాల్ట్ నాలుకపై ఉండే రుచి మొగ్గలను సైతం ప్రభావితం చేస్తాయి.
హైబీపీ, డయాబెటిస్, కండరాలు ముడుచుకుపోవడం, కాళ్లు, చేతుల్లో సూదులు గుచ్చినట్లు అనిపించడం వంటి సమస్యలు ఈ ఉప్పుతో వస్తాయి.
సాస్‌లు, చిప్స్, ప్రిపేర్డ్ సూప్స్, హాట్ డాగ్స్, బీర్లు, క్యాన్డ్ ఫుడ్స్ తదితర ఆహారాల్లోనూ విరివిగా ఉపయోగిస్తారు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.