ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

కిడ్నీ సమస్య. ఇటీవలి కాలంలో కిడ్నీల సమస్యలతో ఎక్కువమంది బాధపడుతున్నారు. కిడ్నీలలో రాళ్లు, ఇన్ఫెక్షన్స్ తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీలను పాడుచేసే పది అలవాట్లు ఇలాంటివారిలో కనబడుతాయి. అవేంటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

రోజుకి కనీసం 3 లీటర్లు మంచినీళ్లు తాగాలి కానీ తక్కువ నీరు తాగటం వల్ల సమస్య వస్తుంది.

ప్రతి చిన్నదానికి ఎక్కువగా మందులు వాడటం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవచ్చు.

ఉప్పు ఎక్కువగా వాడేవారిలో సైతం ఈ సమస్య వస్తుంది.

మూత్రం వచ్చినా గట్టిగా ఆపుకుంటూ ఎక్కువసేపు అలాగే వుండటం.

మాంసాహారం విపరీతంగా తినడం వల్ల కూడా సమస్య వస్తుంది.

సరైన నిద్ర సమయాలను పాటించకపోవడం.

శీతల పానీయాలు అధికంగా తాగడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ రావచ్చు.

మోతాదుకి మించిపోయి కడుపుకి ఆహారాన్ని లాగించడం.

ఇన్ఫెక్షన్స్ కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి కారణమవుతాయి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.