సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు వదిలించుకునే మార్గాలు ఇవే

తొలకరి జల్లులు ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధులు కూడా వెంటబడుతాయి. వాటిలో ముందు వుండేవి జలుబు, దగ్గు. వీటిని వదిలించుకోవడానికి ఇంటి చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము.

credit: Instagram

సాధారణ టీ, కాఫీలకు బదులు అల్లం, పసుపు, లెమన్‌ టీలు తాగుతుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.

గోరువెచ్చని పాలలో కొంచెం పసుపు కలుపుకొని తాగితే ఉపశమనం కలుగుతుంది.

రోజుకు కనీసం రెండుమూడు సార్లు తులసి నీరు లేదా తులసి టీ తాగుతుంటే ఫలితం వుంటుంది.

ఉసిరి, పైనాపిల్‌, నిమ్మ తదితర పుల్లటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.

స్నానం చేసేందుకు, తాగేందుకు చల్లటి నీరును ఉపయోగించరాదు.

ఏమైనా గొంతు సమస్యలుంటే తేనె మంచి ఉపశమనమిస్తుంది.

వేయించిన ఆహార పదార్థాలు, బయటి ఆహారం, కొవ్వు పదార్థాలను బాగా తగ్గించాలి.

ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణుడిని సంప్రదించాలి.