ఉబ్బసం వ్యాధి తగ్గేందుకు పసుపుతో చిట్కా వైద్యం, ఎలాగంటే?
పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గాయాలకు పసుపు రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ పసుపుతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
webdunia
గ్లాసు వేడి పాలల్లో అరచెంచా పసుపుపొడి, కొంచెం మిరియాల పొడి కలిపి ఆ మిశ్రమాన్ని వేడి చేసి ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగడం వల్ల జలుబు, తుమ్మలు దగ్గు లాంటివి నివారింపబడతాయి.
పసుపు, ఉసిరిక చూర్ణం ఈ రెండింటిని రెండు గ్రాముల చొప్పున తీసుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది.
అరచెంచా పసుపులో మూడు చెంచాల స్వచ్చమైన తేనె వేసి రోజుకి మూడు సార్లు చొప్పున నాలుగు నెలల పాటు తీసుకుంటే ఇస్నోఫీలియా తగ్గుముఖం పడుతుంది.
ఉబ్బసం వ్యాధితో చాలామంది సతమతం అవుతుంటారు. అలాంటివారు ఈ చిట్కా పాటిస్తే ఉపశమనం కలుగుతుంది.