కిడ్నీలు పాడుకాకుండా ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తీసుకోవాలి
కిడ్నీల ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకుంటూ వుండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారం కిడ్నీ ఆరోగ్యానికి దోహదం చేసేదిగా వుండేట్లు చూసుకోవాలి. అవి ఏమిటో తెలుసుకుందాము.
webdunia
విటమిన్లు, జింక్, మెగ్నీషియంతో పాటు కొలెస్ట్రాల్ నియంత్రించే శక్తి యాపిల్స్‌కి వుంటాయి కనుక కిడ్నీల ఆరోగ్యం కోసం వీటిని తినాలి.
క్యాలీఫ్లవర్‌లో ఫైబర్, ఫోలేట్, విటమిన్ సి వుంటాయి. ఇవి కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
కిడ్నీలకు మేలు చేసే విటమిన్లు వెల్లుల్లిలో వున్నాయి.
ముల్లంగి కూడా మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మూత్రపిండాలకు మేలు చేసే విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్ మిరియాలలో వున్నాయి.
కిడ్నీలను సులభంగా శుభ్రపరచగల ఒకే ఒక సాధనం మంచినీళ్ళు. దాదాపుగా 8 నుండి 10 గ్లాసుల వరకు ప్రతిరోజు తాగాలి.
బార్లీ ధాన్యం కిడ్నీలను శుభ్రపరచడమే కాదు, ప్రమాదాల బారి నుండి కాపాడగల సామర్ధ్యం కలిగి ఉంటుంది.
గమనిక: చిట్కాలను పాటించేముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి