బొప్పాయి పండు ఎందుకు తినాలి?

ఔషధ గుణాలను కలిగి వున్న బొప్పాయిలో ఆపిల్, జామ, అరటి, అనాస లాంటి పండ్లలో కంటే "కెరోటిన్" అనే పదార్థం అధికంగా ఉంటుంది. అంతేగాకుండా, మానవ శరీరానికి కావలసిన ఎన్నో పోషకత్వాలూ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

బాగా పండిన బొప్పాయిలో కెరోటిన్ చాలా ఎక్కువ మోతాదులో లభిస్తుంది కాబట్టే, వైద్యులు దీనిని ఆరోగ్య ఫలాల జాబితాలోకి చేర్చారు.

బొప్పాయి తింటుంటే జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది.

చక్కెర శాతం తక్కువ ఉండటం వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక.

బొప్పాయి పండు తింటే స్థూలకాయం తగ్గిపోవడమే కాకుండా, షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.

బొప్పాయిలోని లైకోపీన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి

ఆహారంలో బొప్పాయిని ఎక్కువగా చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది

బొప్పాయి తింటుంటే చర్మం మరింత కాంతివంతంగా, యవ్వనంగా కనిపించడంలో సహాయపడుతుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.