ఉగాది పచ్చడిలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

షడ్రుచుల సమ్మేళనంతో తయారుచేసే శ్రేష్టమైన పదార్థమే ఉగాది పచ్చడి. ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఆహార, ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఈ పచ్చడి సేవించడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram

ఉగాది పచ్చడిని వేపపువ్వు, చింతపండు, మామిడికాయలు, బెల్లం, మిరియాలు, ఉప్పు వేసి తయారుచేస్తారు.

వేప పువ్వులో వ్యాధి నిరోధక లక్షణాలు అనేకం. రుతు మార్పు వల్ల పిల్లల్లో వచ్చే ఆటలమ్మ, స్పోటకం, కలరా, మలేరియా సోకకుండా వేప నిరోధకంగా పనిచేస్తుంది. వేపపువ్వుకు రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది.

బెల్లంలో ఔషధ గుణాలు ఎక్కువ. గర్భవతులు బెల్లాన్ని తింటే చాలా మంచిది, బెల్లం రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. బెల్లం అజీర్తి, పొడి దగ్గులాంటి రోగాలు రాకుండా చేస్తుంది.

మామిడి ముక్కల్లో తీపి, పులుపులతో పాటు వగరు గుణముంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా చేస్తుంది, చర్మ వ్యాధులు రాకుండా చూస్తుంది.

మామిడి ముక్కలతో చింతపండు పులుపు కలిసి మనకు మరింత ఆలోచనా శక్తిని పెంచి సన్మార్గంలో నడిపిస్తుంది. టెన్షన్, హడావిడి లేని జీవితాన్ని గడపగలరు

మిరియాలుతో తలనొప్పి, కండరాలు, నరాల నొప్పులు మాయమవుతాయి. చిటికెడు మిరియాల పొడి జీర్ణక్రియ సమస్యలను పటాపంచలు చేస్తుంది.

మానసిక అనారోగ్యాన్ని తొలగించడానికి, శారీరక రుగ్మతలను తగ్గించడానికి ఉప్పు ఎంతో సహకరిస్తుంది. అందుకే ఈ షడ్రుచుల సమ్మేళనంలో ఉప్పూ ఓ భాగమైంది