అతిమూత్రం వ్యాధికి ఆయుర్వేదం చిట్కాలు, ఏంటవి?

అతిమూత్ర వ్యాధితో చాలామంది బాధపడుతుంటారు. ఏవేవో మందులు వాడుతుంటారు. మందులు వాడినప్పుడు తగ్గినట్లు కనిపించినా ఆ తరువాత యథాప్రకారం మూత్రం వస్తూనే ఉంటుంది. ఆయుర్వేద చిట్కాలతో ఈ సమస్యను వదిలించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము.

credit: social media

అతి మూత్ర వ్యాధి తగ్గాలంటే నేరేడు గింజల చూర్ణము 40 రోజులు తినాలి.

అత్తి చెక్క కషాయం తాగుతున్నా సమస్య తగ్గుతుంది.

వెల్లుల్లి పది రోజులు సేవించినా ఈ వ్యాధి తగ్గుతుందట.

మర్రిచెక్క కషాయంను తాగినా సమస్య తగ్గుతుందని చెప్పబడింది.

అత్తిపత్తి ఆకు, బెల్లం, సమపాళ్లలో కలిపి నూరి చిన్న ఉసిరి కాయంత తీసుకోవాలి.

కసివింద చెట్టు ఎండు గింజలను పొడిచేసి తగుమాత్రం తేనెతో మూడు రోజులు భుజించాలి.

ముదిరిన తుమ్మచెట్టు పట్టను, చితక్కొట్టి నీటిలో కషాయముగా కాచి పూటకు ఒకటి నుంచి 2 స్పూనులు చొప్పున రెండుపూటలా తాగాలి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.