చెర్రీ పండు చిన్నదే కానీ తింటే ఏం చేస్తుందో తెలుసా?

చెర్రీ పండ్లు. ఈ పండ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే వీటికి చాలా ప్రాముఖ్యతనిస్తుంటారు వైద్యులు. అనేక రుగ్మతలను పారదోలడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పుల్లని చెర్రీలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram

కడుపు మంట, కురుపులు వంటివి నయం చేసే శక్తి చెర్రీ పండ్లకు వున్నాయి.

టైప్-2 డయాబెటిస్, గుండె వ్యాధులకు దారితీసే ఇన్‌ఫ్లమేషన్‌ను నివారించటంలో చెర్రీ ఉపయోగకారి.

ఆస్టియో ఆర్ధరైటిస్, రుమరాయిడ్ ఆర్థరైటిస్‌ వంటి వాటిని నిరోధించగల మంచి ఔషదం.

చెర్రీలలో కొవ్వు తక్కువ, నీటి శాతం ఎక్కువ, క్యాలరీలు చాలా తక్కువ.

స్థూలకాయం తగ్గించుకోవడానికి ఆహారంలో చెర్రీలను జోడిస్తుండాలి.

చెర్రీలోని 'యాంథోసియానిన్'లు ట్యూమర్ పెరుగుదలను, క్యాన్సర్‌ను నిరోధిస్తాయి.

విమానాలలో అధిక దూరాలు ప్రయాణం చేసేవారు నిద్రపోవటానికి గంట ముందుగా ఎండబెట్టిన చెర్రీలను తింటే మంచిదంటారు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.