మతిమరుపును మాయం చేసే ఫుడ్ ఐటమ్స్, ఏంటవి?

మతిమరుపు. ఈ సమస్య కొంతమందిలో వుంటుంది. చాలాసార్లు కీలకమైన విషయాలను మర్చిపోతుంటారు. పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామో అని వెతుక్కుంటుంటారు. ఇలాంటి మతిమరుపు పోవాలంటే ఈ క్రింద చెప్పుకునే పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం వుంటుందని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media

బాదం గింజలు తింటుంటే మతిమరుపు తగ్గటానికి ఎంతో దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు.

మతిమరుపును దూరం చేసే వాటిలో వాల్నట్స్ కూడా వున్నాయి. వీటిని ఆక్రోట్లు అంటారు.

అంజీరతో కలిపి ఆక్రోట్లను తింటుంటే మతిమరుపు సమస్యను నిరోధించవచ్చు.

యాపిల్ పండ్లను తింటుంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా చేయగలవని చెపుతారు.

తేనె లేదంటే పాలతో యాపిల్ పండ్లను తీసుకుంటే నాడుల పునరుత్తేజం కలిగి మతిమరుపు దూరమవుతుంది.

బెర్రీ పండ్లు కూడా మతిమరుపు రాకుండా అడ్డుకోగలవని తేలింది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.