జలుబు తగ్గేందుకు ఇంటి చిట్కాలు, ఏంటవి?

వాతావరణం మారుతున్నప్పుడల్లా సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. ముఖ్యంగా జలుబు ఎక్కువగా చాలామందిని పట్టి పీడిస్తుంటుంది. దీనికి ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాము.

credit: social media and pixabay

జలుబు తగ్గాలంటే పుష్కలంగా ద్రవాలు తాగుతుంటే అవి ముక్కు రద్దీని తగ్గించి సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది.

స్టౌ పైన పాత్రలో నీటిని వేడి చేసి దాని ఆవిరిని ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకోండి.

సెలైన్ స్ప్రే లేదా సాల్ట్ వాటర్ రిన్స్ ఉపయోగిస్తుంటే సమస్య తగ్గుతుంది.

జలుబు సమస్యను అధిగమించడంలో సైనస్ సమస్య తగ్గించే పరికరాలను వైద్యుల సలహా మేరకు వాడవచ్చు.

జలుబు లేదా ఫ్లూ సమస్య తలెత్తినప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.

గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించండి.

హెర్బల్ టీ వంటి వేడి వేడి ద్రవాలు త్రాగాలి.

రాత్రి నిద్రించేటపుడు తల కింద ఒక అదనపు దిండును పెట్టుకుంటే శ్వాస తీసుకోవడం తేలికగా వుంటుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.