ధ్యానం చేస్తే ఎంత శక్తిమంతం అవుతారో తెలుసా?

ధ్యానం లేదా మెడిటేషన్. ధ్యానం చేస్తే పలు అనారోగ్య సమస్యలు తగ్గుతాయంటారు. అంతేకాదు, మనసు ప్రశాంతంగా మారడంతో సానుకూల దృక్పథం ఏర్పడి జీవితంలో రాణిస్తారు. ధ్యానంతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

webdunia

ధ్యానంతో మానసిక, శారీరక శ్రేయస్సు కలుగుతుంది.

ఒత్తిడితో కూడిన పరిస్థితులపై కొత్త దృక్పథాన్ని పొందే శక్తి వస్తుంది.

ఒత్తిడిని నిర్వహించడానికి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ధ్యానం మేలు చేస్తుంది.

వర్తమానంపై దృష్టి సారిస్తూ విజయపధంలో నడిచేందుకు ధ్యానం తోడ్పడుతుంది.

ప్రతికూల భావోద్వేగాలను తగ్గించడంలో మెడిటేషన్ కీలకపాత్ర పోషిస్తుంది

ధ్యానంతో ఊహాశక్తితో పాటు సృజనాత్మకత పెరుగుతుంది.

ధ్యానం చేసేవారిలో బాగా సహనం పెరుగుతుంది.

ధ్యానంతో విశ్రాంతి హృదయ స్పందన రేటును తగ్గించడం ద్వారా ఆరోగ్యంగా వుండవచ్చు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణుడిని సంప్రదించాలి.