కంటి చూపును బలపరిచే అద్భుతమైన 6 ఆహారాలు, ఏంటవి?

శరీరంలో అతి ముఖ్యమైన భాగం కన్ను. చాలామంది సరైన ఆహార పద్ధతులను అనుసరించకపోవడం వలన చిన్నవయస్సులోనే కంటి సమస్యలకు లోనవుతారు.

credit: social media

కళ్లను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు రోజువారీ ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి.

కంటిచూపు ఆరోగ్యకరంగా వుండేందుకు ప్రతిరోజూ అవసరమైనన్ని మంచినీరు తాగుతుండాలి.

కేరట్‌లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ వంటి పోషకాలు కంటిచూపుకు మేలు చేస్తాయి.

ఒమేగా 3 ఆయిల్ నిండిన చేపలను తింటే కంటి నరాలను సంరక్షిస్తాయి.

గింజ ధాన్యాలైన బాదం, వాల్నట్ తదితరాలను తీసుకుంటుంటే కంటికి అవసరమైన పోషకాలు అందుతాయి.

కంటి నరాలు బలంగా వుండేందుకు చిలకడ దుంపలు తీసుకోవాలి.

ఆకు కూరలైన గోంగూర, తోటకూర, పాలకూర వంటివి తింటుంటే విటమిన్ ఎ అందుతుంది.