శీతాకాలం వచ్చేస్తోంది. చలిగాలులు ప్రారంభమయ్యాయి. కాలాలకు తగ్గట్లుగా మనం ఆహారాన్ని కూడా మార్చుకుంటుండాలి. శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
క్యారెట్- వీటిలో విటమిన్ ఎ, సి, కెరోటినాయిడ్స్, పొటాషియం వుంటాయి. శీతాకాలంలో రోగనిరోధక శక్తికి మేలు చేస్తాయి.
బంగాళాదుంపలు- వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇవి యాంటీఆక్సిడెంట్.
ఉల్లిపాయలు- ఇవి యాంటీఆక్సిడెంట్లు, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
వెల్లుల్లి- వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీర రక్షణకు ఎంతో దోహదం చేస్తాయి.