టీతో కలిపి ఇవి తినకూడదు, ఏంటవి?

టీతో కొన్ని పదార్థాలు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బందులకు గురి చేసే అవకాశం వుంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాము.

credit: social media and webdunia

శెనగపిండితో చేసిన పదార్థాలను టీతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.

సలాడ్, మొలకెత్తిన గింజలు లేదా ఉడికించిన గుడ్లు వంటివి టీతో తీసుకోవడం కూడా అనారోగ్య సమస్యలు తెస్తాయి.

టీ తాగిన వెంటనే పసుపు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోకూడదు.

నిమ్మకాయ కంటెంట్ ఉన్న టీతో దేనినీ కూడా ఉపయోగించవద్దు. దీని వల్ల ఎసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి.

టీలో ఉప్పు బిస్కెట్లు లేదా ఉప్పు ఎక్కువగా ఉన్నవి ఏవైనా తినడం హానికరం.

టీతో లేదా టీ తాగిన తర్వాత మంచినీరు లేదా ఏదైనా చల్లని పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు.

టీతో ఐరన్ అధికంగా ఉండే వాటిని తినడం మానుకోండి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.