కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

కామెర్లు. ఇది లివర్ పైన ప్రభావం చూపే వ్యాధిగా చెప్పబడింది. కామెర్ల వ్యాధి వచ్చినవారు ఆహారంలో పత్యం పాటించాల్సి వుంటుంది. అంటే... కొన్ని పదార్థాలు తినవచ్చు. మరికొన్ని పదార్థాలను ఎట్టి పరిస్థితులలో తీసుకోరాదు. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

యాపిల్స్, బెర్రీస్ వంటి పండ్లు ఆరగించవచ్చు.

క్యారెట్స్, చిలకడదుంపలు, బీట్ రూట్స్ తినవచ్చు.

ఉప్మా లేదా పోహ వంటి అల్పాహారాలను భుజించవచ్చు.

వెన్న లేకుండా మజ్జిగ, బెర్రీస్ జ్యూస్ తాగవచ్చు.

ఇక బాగా వేయించిన పదార్థాల జోలికి వెళ్లకూడదు.

వెన్న, నెయ్యి, కొవ్వుతో నిండిన పాల పదార్థాలు తినరాదు.

బటర్ చికెన్, బిర్యానీ, పరోటాలు వంటి వాటి జోలికి వెళ్లకూడదు.

అరటి కాయలు మోతాదు మించి తినరాదు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.