బీట్ రూట్ దుంపలను ఎవరు తినకూడదో తెలుసా?

బీట్ రూట్. ఆరోగ్యానికి మేలు చేసే దుంపకూరల్లో బీట్ రూట్ కూడా ఒకటి. దీని జ్యూస్ తాగితే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఐతే వీటిని కొంతమంది దూరంగా పెట్టాలి. ఎందుకు పెట్టాలో తెలుసుకుందాము.

credit: social media

తక్కువ రక్తపోటు సమస్యతో బాధపడేవారు బీట్ రూట్ దుంపను తినకుండా వుండటం మంచిది.

కిడ్నీ సమస్యలతో బాధపడేవారు బీట్ రూట్లను తినరాదు, అలాంటివారికి కిడ్నీస్టోన్స్ ప్రమాదం పెరుగుతుంది.

చంటిపిల్లలకి ఈ దుంపలతో చేసిన రసాన్ని కానీ, మరే రూపంలో కానీ ఇవ్వకూడదు.

పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు బీట్ రూట్ దుంపలను తినకపోవడమే మంచిది.

కేన్సర్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ దుంపలతో చేసిన పదార్థాలను తినరాదు.

కొంతమందికి ఈ బీట్ రూట్ దుంపలంటేనే ఎలర్జీ వుంటుంది, అలాంటివారు కూడా తినరాదు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా బీట్ రూట్ దుంపలని తినకపోవడం మంచిది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.