నువ్వులు. ఇవి శరీరానికి అందవలసిన ప్రోటీన్‌కి మంచి మూలం. ఈ నువ్వుల్లో ఇరవై శాతం మేర అధిక-నాణ్యతతో కూడిన అమైనో ఆమ్లాలు ఉంటాయి. నువ్వులు ఆహార పదార్థాల ద్వారా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media
నువ్వులు మెగ్నీషియం, ఇతర పోషకాలను కలిగి ఉంటాయి కనుక ఇవి మధుమేహాన్ని ఎదుర్కోవటానికి దోహదపడుతాయి.
నలుపు రంగులో వుండే నువ్వుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత, బలహీనతతో బాధపడుతున్న వారికి మేలు చేస్తాయి.
నువ్వుల గింజల నూనె అథెరోస్క్లెరోటిక్ గాయాలను నివారిస్తుంది, అంతేకాదు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.