చెప్పులు లేకుండా నడిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

చెప్పులు. కాళ్లకు చెప్పులు లేకుండా నడిచేవారిని ఇప్పుడు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఇపుడు ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని నడిచేస్తున్నారు. కాళ్లకు చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము.

credit: twitter and webdunia

చిన్నచిన్న రాళ్లు పాదాలకు గుచ్చుకోవడం వల్ల పాదాలలో రక్తప్రసరణ పనితీరు బాగుంటుంది.

పాదరక్షలు లేకుండా నడవడం వల్ల శరీర భంగిమలో తేడా లేకుండా సరిగ్గా వుంటుంది.

చెప్పులు లేకుండా భూమి పైన నడవడం వల్ల సహనం కూడా పెరుగుతుందని చెపుతారు.

పొత్తికడుపుపై ఒత్తిడి కలిగి, జీర్ణక్రియ సక్రమంగా వుంటుంది.

పాదాలకు చెప్పులు వేసుకోకుండా నడవడం వల్ల రక్తపోటు కూడా అదుపులో వుంటుంది.

మనిషి పాదాల్లో 72 వేల నరాల కొనలు వుంటాయి, చెప్పుల్లేకుండా నడవడం వల్ల ఈ నరాలు చురుగ్గా వుంటాయి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.