ఐశ్వర్య, త్రిష స్నేహితురాళ్లేనా
దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ ఈ నెల 30న తొలి భాగం విడుదల కానుంది.
instagram
షూటింగ్ సమయంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో త్రిష స్నేహం చేయొద్దని దర్శకుడు కండిష్ పెట్టారట.
ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు.
ఇవేమీ పట్టించుకోని ఐశ్వర్య - త్రిషలు కలిసి ఓ సెల్ఫీ దిగారు. ఇది నెట్టింట వైరల్ అయింది.
సినిమాలో ఈ ఇద్దరు పాత్రలకు సంబంధించి చాలా ట్విస్టులు ఉండబోతున్నాయని టాక్.
ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లను ఒకే ఫ్రేములో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్.
పీఎస్‌లో విక్రమ్, కార్తీ, జయం రవి, పార్దీబన్, అరవింద్ స్వామి, త్రిష, ఐశ్వర్యరాయ్, శోభిత ధూళిపాళ, నాజర్‌లు నటించారు.
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.