హీరో ప్రభాస్‌తో భేటీ కానున్న అమిత్ షా

రెబల్ స్టార్ కృష్ణంరాజు స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రభాస్‌ను పరామర్శించేందుకు అమిత్ షా రేపు వస్తున్నారు.

Instagram

16వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తారు.

ప్రభాస్ తన షూటింగ్‌ను విర‌మించుకుని హైద‌రాబాద్‌లో ఇంటి వ‌ద్ద‌నే వుండ‌నున్నారు.

ముఖ్యంగా కృష్ణంరాజు మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న్ను క‌ల‌వాల‌నుకున్నా సాధ్య‌ప‌డ‌లేదు.

అందుకే ప్ర‌త్యేకంగా రేపు అనగా 16వ తేదీ శుక్ర‌వారంనాడు క‌ల‌వ‌నున్న‌ట్లు ప్ర‌భాస్‌కు సందేశాన్ని అంద‌జేశారు.

బిజెపి పార్టీకి సంబంధించిన ప‌లు కార్య‌క్ర‌మాల్లో భాగంగా హైద‌రాబాద్ వ‌స్తున్నారు అమిత్ షా.

కృష్ణంరాజు బిజెపి పార్టీ కార్య‌క‌ర్త‌గా వున్నారు.

కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్‌కి ఏమైనా పొలిటికల్ ఆఫర్ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది.